జులై 2, 2007

మరదే, నాకు ఒళ్ళు మండుద్ది!

ఎవడి పనిలో వాడు ఉంటే మన తెలుగువాళ్ళలో కొంతమందికి పనీపాటా లేక తెలంగాణా బ్లాగులు రాశేస్తున్నారు. వీళ్ళకి ఇదేం ఆనందమో నాకైతే అర్ధం కావట్లేదు. వీళ్ళలో కొంతమంది రాజకీయ స్వలాభం కోసం రాస్తుంటే, కొంతమంది ధనాన్ని ఆశించి రాస్తున్నారు. ఐతే ఎక్కువమంది ఏదో స్వాతంత్ర పోరాతం చేస్తున్నట్టు ఫీలైపోతున్నారు. నిజానికి వీళ్ళకి కాదు తిక్క, ఆ విషయం గురించి వీళ్ళ పోస్టులు చదివుతున్న మనకి.

“తెలంగాణా ప్రజలు 1969 లో ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమించారు”, “Six Point Formula”, “371-D సవరణ”, ” గాడిద గుడ్డు” అంటూ జనాలకి సంబధం లేని చెత్త అంతా చెప్పి కంఫ్యూస్ చేస్తూ మన బుర్రల్లో గుజ్జుని జుర్రుకోవడంలో వీళ్ళకి వచ్చే ఆనందం ఏమిటో అస్సలు పాలుపోవట్లేదు. మొత్తం వెబ్లో ఉన్న బ్లాగుల్లో ఓ ముప్పైశాతం ఈ సోదిగాళ్ళ బ్లాగులే ఉంటాయి చెండాలంగా.

మీరు గమనించారో లేదో, మన ఊళ్ళలో అక్కడక్కడా క్రిస్టియన్ చర్చిల్లో వాళ్ళు, గంటల తరబడి ఉపన్యాసాలు ఇచ్చేస్తూ, పేజీలకొద్దీ వ్యాసాలు రాసేస్తూ, వందల కొద్దీ క్రీస్తు పాటలు రాసేస్తూ ఉంటారు; అది చూస్తేనే ఒకోసారి తిక్క దె**ది. వాళ్ళని చూసి అనుకునే వాడిని, ఏది ఏమైనా వీళ్ళు “సాహిత్యం”లో చాల గొప్పవాళ్ళు అనుకునేవాన్ని. ఇప్పుదు ఈ తెలంగాణా పోరాటయోధుల్ని చూశాక కూడ అదే ఫీలింగ్.

ఏం చేస్తంలే, తోటి తెలుగువాళ్ళే కదా అని ఇణ్ణళ్ళూ నోరుమూసుకుని ఊరుకున్నా. మొన్న మా ఫ్రెండుని, నువ్వు కూడా తెలుగు బ్లాగు రాయచ్చు కదరా అంటే, “నాకేమన్నా మెంటల్ అనుకున్నావా, మనం ఎంత ఇదిగా రాశినా ఆ  తెలంగాణా బ్లాగుల మధ్యలో మనది కనపడను కూడా కనపడదు” అన్నాడు. అది విన్నాక ఈ ఎదురుదాడి నాకు తప్పలేదు.

తెలంగాణా కనక వేర్పడితే, వేర్పడిన రాష్ట్రంలో నేటివ్ తెలంగాణా వారు మాత్రమే ఉండాలి అంటే, “అది చచ్చు ఆలోచన అని తెలుసుకుని, ఇప్పటివరకు తెలంగాణా వాగుడు వాగిన వాళ్ళందరు నాలిక్కరుచుకుంటారు. ఇది ముమ్మాటికీ నిజం.”

జులై 2, 2007

పునః ప్రారంభం గురించి?

తప్పలేదు మరి ఏమి చెయ్యమంటారు! పేరు నా బ్లాగుకి నప్పలేదు అనిపించి ఇంకో బ్లాగు మొదలెట్టాను. అది కాస్తా పరీక్షలవల్ల కొనసాగించలేక మధ్యలో డుమ్మా కొట్టాను; ఐనా మీ అందరి బ్లాగులు చదువుతున్నాను లెండి. ఇప్పుడు కొంచెం ఖాళీనే కాబట్టి, మళ్ళా కొనసాగించే ప్రయత్నం చేస్తా.

ఈ మధ్య కాలంలో కిరణ్ ఒకడు కొంచెం పర్వాలేదు, బానే రాస్తున్నాడు అనిపించింది. తేనెగూడులో 387 బ్ల్లగులు చూసి కొంచెం తృప్తిగా ఉంది. నంబరు బానే పెరిగిందిలెండి. కూడలి మాత్రం నాకు ఎప్పుడూ చెత్తగానే అనిపిస్తుంది, అదేంటో మీలో కొందరికి బాగుంటుంది!

ఇప్పట్నించి నా పోస్టులు కొంచెం బెటర్ గా ఉంటాయని మాత్రం చెప్పగలను. మనలో మన మాట, ఇంతకీ ప్రెసిడెంట్ అయ్యేది ఎవరు?

ఏప్రియల్ 25, 2007

నేను గది మారితున్నా(Domain konnanu - dead cheap 1$)

ఏమీలేదు, ఎప్పట్లాగే నాకు పాత Domain అంటే బోరుకొట్తింది. జిల్లా గ్రంధాలయం(ZillaGrandhalayam) అనే పేరుకి నేను అంత న్యాయం చెయ్యట్లేదనిపించింది కూడా. కనుక వేరే చోటకి మారుతున్నా. ఇకనించి మీరు అంతా నా తొక్కలో బ్లాగుని నాగోల http://nagola.info/ నుండి చదవగలరు!

ఈ blog కావాలంటే కింద కామెంట్ చెయ్యగలరు .

సెలవ్

ఏప్రియల్ 21, 2007

ఓపెన్ ఆఫీసులో (open office) తెలుగెలా

విస్టా వాళ్ళకు:

1. ముందుగా మీ ఓపెన్ ఆఫీసుని ఓపెన్ చేసి, అందులో tools>options ని క్లిక్ చెయ్యండి.
2. ఇప్పుడు, వచ్చిన విండోలో కింద చూపినట్టుగా కాంప్లెక్స్ టెక్స్ట్ భాషని (enable CTL by checking the shown box) ఎనేబుల్ చెయ్యండి.
3. ఆపై కింద చూప్పినట్టుగా CTL (Telugu) నకు సరైన ఫాంటును (in most cases Gautami) కాంఫిగర్ చెయ్యండి. అంతే.

తక్కిన విండోస్లలో(like Windows XP) ముందుగా మీ కంప్యూటర్కి తెలుగేంటో చెప్పాలి. అదెట్లా చెయ్యాలో ఇక్కడ ఉన్నట్టుగా చేసి, పైన ఉన్న మూడు పనులను మళ్ళా చెయ్యండి. ఇంక మీరు కూడా తెలుగులో డాక్యుమెంట్లు తయారు చెయ్యగల్గుతారు.

పరీక్షించాలంటే, ఈ తెలుగు టెక్స్ట్ ను మీ ఓపెన్ ఆఫీస్లోకి పేస్ట్ చేసి చూడండి, ఐపోతుంది! కాంఫిగర్ చేయ్యగానే ఒకసారి ఓపెన్ ఆఫీసుని మూసి మళ్ళా తెరవండి, ఎందుకైనా మంచిది. PDF డాకుమెంట్లు కావాలంటే ఆ బాటన్ ను నొక్కితే, ఫాంట్లు వాటంతటవే అందులో నిర్లిప్తమైపోతాయి. వేరేగా embed చెయ్యాల్సిన పని ఉండదు.

ప్రత్యేక సందేహాలు ఏమన్నా ఉంటే, చెప్పచ్చు.. మొహమాటాలు ఏమీ లేవులే!

ఏప్రియల్ 12, 2007

“Unjustify” ఇక మరింత సులువు

ముందుగా unjustifyని తయారుచేసిన వీవెన్ కి ధన్యవాదాలు. ఐతే, మీలో ఫైర్ ఫాక్స్ వాడే వాళ్ళకి రెండు విషయాలు చెప్పదలచుకున్నాను.

1. Grease Monkey (గజ్జి కుక్క / గబ్బు కోతి) [ "కోతి" అంటే కలవలేదనిపించి... ] అనే పొడిగింతని జతచేయడం…
2. ఆపై unjustify te అనే యూజర్ స్క్రిప్టు ని ఇన్స్టాల్ చెయ్యడం. (నొక్కి చూడండి)

దీని వల్ల మీరు, ఏదేని వెబ్ పేజీని తెరిచాక, బుక్కుమార్కుల్లో ఉన్న unjustifyని నొక్కనక్కర్లేకుండానే ఆపని చేసెయ్యొచ్చు. దీన్ని విశ్లేషిస్తే ఇలాంటి ఉపకరణాలు మీరు కూడా తేలికగా చేయగల్గుతారు.

ఐతే, ఈ స్క్రిప్టును ముందస్తుగా తయారుచేసిన వీవెన్ కి నా కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను.

గజ్జి కుక్క గురించి: ఫైర్ఫాక్స్ పొడిగింతల్లో ఇది అన్నిటికంటే కూడా ఉత్తమమైనది అని నా ఉద్దేశం. సరిగ్గా ఆలోచిస్తే మీరు కూడా అంటార్లెండి, ఔనని!

ఏప్రియల్ 4, 2007

బాబోయ్.. మొత్తం కెలికిపెట్టారు..

మొత్తం గూగుల్ అనువాదలని కెలికేశారు. గూగుల్ తెలుగులో, ఆంగ్ల అక్షరాలు ఎందుకు వస్తున్నాయా అనుకుంటున్నా, ఇన్నాళ్ళూ!

అనువదించమంటే, అలా ఎవరు చేసిపెట్టారో కానీ, ఇప్పుడు, పని రెండింతలు అయ్యేట్టు ఉంది. ఒక పకడ్బందీ ఉపాయం వేస్తే తప్ప అవ్వదు ఏమో?

కొన్నాళ్ళు చూస్తాను,వల్లకాదు అనిపిస్తే ఇంక వదిలేస్తానండీ బాబు. మెల్లగా నాకు కూడా గూగుల్ మీద మోజు పోతోంది.

మేరే చూడండి, గూగుల్ తెలుగు ఎంత అధ్వానంగా ఆంగ్ల అక్షరాలకి దాసోహం అయిపోయిందో.

ఏప్రియల్ 3, 2007

అర్ధం పర్దం లేని నా పాకులాట

మన నాలుగు రాష్ట్రాలను విద్యాసంపన్నమైన ప్రాంతాలుగా చెప్తుంటారు.. ప్రత్యేకంగా మన ఆంధ్ర దేశాన్ని అటు, ఉత్తర భారతదేశానికి, ఇటు దక్షిణాది రాష్ట్రాలకు లంకెగా వర్ణిస్తారు. ఎన్నో స్వదేశీ విదేశీ సంస్థల్లో మనవాళ్ళు అత్యంత కీలకపాత్రలు పోషిస్తున్నారు, నిజమే కానీ,

మనవాళ్ళు తాము సంపాదించిన ఇటువంటి ఘనతలో కనీసం కొంత భాగాన్ని కూడా తిరిగి మన రాష్ట్రానికీ, రాష్ట్ర ప్రజలకు ఎందుకు అందించలేకపొతున్నారు అనేది నన్ను ఎప్పుడూ తొలిచివేసే విషయం. నేను ఎందుకు ఇలా అంటున్నాను అంటే, మీరే చూడండి…

ఒక పక్క విదేశాలలో, ప్రతి మూడొంతులలో, రెండొంతులు మన తెలుగు వారే ఉంటారు… ఆ తెల్లతోలు వాళ్ళకి అంతంత చాకిరీ చేస్తారు, వేరే రాష్ట్రాల వాళ్ళకీ ఇంతలేశి పని చేశి పెడుతుంటారు. తమ మేధస్సుని తక్కిన వాళ్ళకి ఉపయోగించినదాంట్లో ఎంతోకొంత తమవారికి కూడా ఇవ్వచ్చు కదా!

అర్ధం పర్దం లేకుండా, రిజర్వేషన్ల కోసం పోరాటాలు చెయ్యడం, మరికొంత మంది రాష్ట్రాన్ని స్వలాభం కోసం ముక్కలుగా చేశే ప్రయత్నం చెయ్యడం…ఇవన్నీ అవసరమా??

మార్చి 30, 2007

ఆవిరౌతున్న మన సినిమా నైపుణ్యం…

మీరు ఒప్పుకుంటారో లేదో కానీ, ఒక రకంగా చెప్పాలంటే, ఇది నిజంగా నిజం. అన్ని రంగాలలో మనం మెల్లగా మరుగున పడిపోతున్నామేమో? చదావండి, మీకు కూడా అనిపిస్తుంది…

ప్రస్థుతానికి, అత్యంత జనాదరణ ఉన్న మన సినిమా-నాటక రంగాన్నే తీస్కుందాం.. ఒకప్పిటి మన సినిమాని చూసి హర్షించని వాడులేడు. ఒకరకంగా చెప్పాలంటే, అప్పట్లో తెలుగు సినిమాలను, అరవంలో డబ్బింగ్ చేశేవారు..మరి ఇప్పుడు కధ అడ్డం తిరిగింది, తమిళ సినిమాలను తెలుగులోకి తర్జుమా చేస్కోవాల్సిన పరిస్థిథి! మనకి అవసరమా… సినిమాలు, కధలు, కధానాయకులను ఎన్నుకొనే విధానం కొంత మారితే నయం కదా.

అదే కధని కొత్తగా తీయడం కేవలం దర్శకుడి గొప్ప మాత్రమే, మొత్తం కొత్త సినిమాని తీసి దాన్ని జయప్రదం చేస్కోగల్గడం అందరికీ(నటులు, రచయితలతో సహా) గొప్ప కదా! ఆలోచించండి.

ఇక ఇప్పటి సినిమాలను, రామారావు గారి “యుగంధర్” సందర్భంలోని వాటితో పోల్చి చూద్దాం:

నిజానికి, అవే సినిమాలు ఇప్పటి ఎచ్ డీ లో కనక వచ్చి ఉంటే, నా సామి రంగ! ఈ చిరంజీవి, జూ|| యంటీఆర్ ల సినిమాలకు స్వస్థి పలికేశేవాడిని.

మనవాళ్ళు తమిళ తమ్ముళ్ళ దగ్గర నేర్చుకొనో, మ్యాట్రిక్స్ లాంటి సినిమాలని చూశేసో, గాలిలో ఎగిరే ఫైట్లు నేర్చేసుకుని, దాన్ని మసాలా డైలాగులతో రంగరించి, సావగొడుతోంటే, ఒకొక్క సారి నవ్వాలో ఏడవాలో తెలవట్లేదు.

వీటితో వదిల్తేనా, మళ్ళీ నేత్ర దానం, రక్త దానం సినిమా పాటల్లో పబ్లిసిటీ ఒకటి. యం.టీ.ఆర్, ఏ.యన్.ఆర్ లకు అంత రాజకీయం తెలీదు కాబోలు. లెకపోతే, సినిమాని అన్ని రకాలుగా వాడుకునేంత అవకాశవాదులు కారేమో!

అటుపక్క HD, BluRay, IMAX అని పరిగెడుతుంటే, ఇక్కడ మనాళ్ళకి కర్చుపెడదామన్నా తగ్గ కధే లేకపాయె. ఎమో, ఏదో ఒకటి జరిగి కొంతకాలానికి మంచి సినిమాలు వస్తే బాగుణ్ణు. ఏమంటారు?

మార్చి 15, 2007

లేఖిని నాగార్జున గారికి:

నాగార్జున గారూ.. మీరు తయారు చేసిన లేఖిని నిజంగా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంతకముందు ఎవరన్నా నన్ను తెలుగు ఎలా రాయాలి అని అడిగితే, వారి కంప్యూటర్ను ఎలా కాంఫిగర్ చేస్కోవాలో చెప్తుంటే, అంతగా శ్రద్ధ చూపేవారు కాదు..లేఖిని వచ్చాక నాకు చెప్పడం తేలిక అయ్యింది.. నేను పరిశీలించిన మేరకు క్విల్ ప్యాడ్ కంటే కూడా ఇదే నయం.

ఐతే, లేఖిని గురించి నా ఆశల/అభిప్యారల చిట్టా ఇక్కడ పెడుతున్నా..
1. జి.పి.ఎల్ కి మార్చ గలరు
2. ఒక “ఫోరం” లేఖినితో జత చేస్తే, మరిన్ని ఆలోచనలు పోస్టు చెయ్యచ్చు!
3. మీరు అన్నట్టు లాగిన్ వ్యవస్త వల్ల లేఖినిని వాడటం, లాగిన్ అయీన వాళకే పరిమితం చెయ్యరు కదా.. ఈ విషయం లో మాత్రం జాగ్రత్తగా ఆలోచించండి?
4. లేఖిని లో కింద ఉన్న ప్రకటనల మనకు ఏమాత్రం పనికిరావని నా అభిప్రాయం….అవి తీసేసి “విరాళాలను” ఆహ్వానిస్తే ఎలా ఉంటుంది??

ఇంకా ఉన్నాయి…గుర్తు చేసుకుని జత చెస్తా..

నిజానికి నా నైపుణ్యం కూడా చాలా తక్కువే, ఐతే (ఫోరంలు జత చెయ్యడం వంటి విషయాలలో కొంచం అనుభవం ఉంది). ఏం చెయ్యమంటారు నేను ఎలక్ట్రానిక్సు వాడిని కదా!

మార్చి 4, 2007

అనువాదాల గురించి ఒక మాట:

ముందు మనం జీమయిలు మొత్తాన్ని 100% పూర్తి చేసేసి, ఆ తరవాత అందరం కలిసి దాన్ని క్షుణ్ణం గా పరిశీలించేసి దున్నేద్దాం…ఏమంటారు…

అన్నట్టు…మీరు అనువదిస్తుండగా ఏదన్నా ఆంగ్ల పదానికి మీకు సరైన అనువాదం అనిపిస్తే దాన్ని బయటకి చెప్పడం మరిచిపోవద్దు.
 

ఉదా: నాకు ‘Delete’ కి ‘రద్దు ‘ కంటే ‘తొలగించు ‘ సరైంది అనిపించింది. ఇలాంటివన్నీ ఒకచోట పేర్చుకోగలిగితే వేరే సాఫ్ట్వేర్ అనువాదాలను తేలికగా చేస్కోవచ్చు….ఏమంటారు?

ఈ అనువాదాలలో చాల మంది చెయ్యి వేస్తున్నారని తెలుసు, ఐతే చేసే వాళ్ళు అందరు ఇలా కలిసి అనుకుని చేస్తే అన్నీ గబ గబా ఐపోతాయి..అదీ కథ…కనుక మీరు కనిపెట్టినవన్నీ ఎప్పటికప్పుడూ ఒకచోట “ఉదా: ఇక్కడ కింద వ్యాఖ్యానాలలో ” రాస్తారా??