ఫిబ్రవరి 11, 2007...10:06 పూర్వాహ్నం

వెనుక బడి ఉన్నాం!

Jump to Comments

కొద్ది రొజులుగా నేను ఏమి ఆలొచిస్తున్నానో, ఏమి వెతుకుతున్నానో, టూకీగా…

100 కోట్ల జనభా ఉండగా…ఆంగ్లము మాట్లాడటానికి మనం ఎందుకు తాపత్రయ పడుదుతున్నామా అని…
-> నిజానికి..ఆంగ్లం మాట్లడటానికి ఇల మనం అలవాటు పడిపోవడం వల్లనే ఇప్పుడు దేశ భాషల్లొ ఒక్క సరైన సాఫ్ట్ వేర్  కూడా లేదు ( దీని వల్ల మన కంప్యూటింగ్ విధానానికే పెద్ద దెబ్బ! )…అదే ఇంగ్లీషు, చైనీస్ లలో ఐతే
ఏకంగా ఎంటర్ ప్రైస్ ఎడిషన్లు వస్తున్నాయి..

ఏమయ్యి ఉంటుంది:
నిజానికి ఈ కంప్యూటర్ల విషయం లో కూడా  మనమే ముందు ఉండే వాళ్ళం! కానీ బ్రిటీష్ పాలన వల్ల మనం పోగొట్టుకున్న వాటొలో ఇది కూడా ఉంది అని అప్పుడే అర్ధం అయ్యింది. ఇప్పటి యూనీకోడ్  లాంటి విధానం ఎప్పుడో వచ్చి ఉండేది…చండాలంగా “యాస్కి” మత్తులో పడ్డాం మనం, మన దురద్రుష్టం…మన కాలీజీలలో కూడా  “యాస్కి” కంప్యూటింగ్ నే నేర్పిస్తున్నారు (“సి” అండి బాబు!). కనీసం యూనీకోడ్ ని వాడగల కంప్యూటర్ భాష(అన్ని ఇంజినీరింగ్ బ్రాంచ్ ల వళ్ళకి) ఒక్కదానిని అన్నా నెర్పితే…బాగుండు కదా!

దేశ భాషల్లొ, ఒక్క ప్రోగ్రామింగ్ లాంగ్వాజీ కూడా లేక పోవడం మన దురద్రుష్టం కాదు, మన నిర్లక్ష్యం. దానికి తోడు… స్కూళ్ళలో కుద ఇంగ్లీషుని ని తోశేస్తున్నాం. దౌర్భగ్యం కాక ఏమంటారు?

ఇంకా, ఏదన్నా కొత్త సాఫ్ట్ వేర్ (ఫైర్ ఫాక్స్ ఏ అనుకోండి), దానికి ముందుగా తమిళ్, హింది లాంగ్వాజీ ప్యాక్ లు ఉంటాయి… కాని..తెలుగు కి మాత్రం ఉండవు, పుండు మీద కారం చల్లినట్టు! ఎంటయ్యా అని అడిగే వాళ్ళే ఉండరు.. మనం తెలుగు లంగ్వాజ్ ప్యాక్ కావాలని డిమాండ్ చెస్తే కదా వళ్ళు తయారు చెశేది!

కొసమెరుపు:
మీకు ఒకటి చెప్పనా… తెలుగు, తమిళ్ లో మొట్ట మొదటి గా  ఒక స్క్రిప్టింగ్ లాంగ్వాజీ ని కనుక్కున్నారంట….దాని తరవాత ఒక బుడ్డోడు.. హిందావి అనే ప్రోగ్రామింగ్ లంగ్వాజీ కనిపెత్తాడంట…

ఐతే ఇది హిందీ లో నే ఉంటుంది..వాడు దానికి బెంగాలి వర్షన్ కూడా తయారు చేశాడంటలే తర్వాత! మీ ఆలోచనలు ఏంటో కింద వ్రాయ గలరు…నేను ఇంక సరిగ్గా చెప్పలేక పోతున్నాను అనే వెలితి నాకైతే ఉంది.

1 వ్యాఖ్య

  • నాక్కూడా కొన్ని సార్లు ఆశ్చర్యంగా వుంటుంది. కంప్యూటర్ రంగంలో బాగా ఎక్కువగా వున్న తెలుగు వాళ్ళకు సాఫ్టువేరు దగ్గరకు వచ్చేసరికి మొండి చెయ్యి కనిపిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా హిందీ తరువాత మొదట వుండేది తమిళమే. అందుకు కారణం వారి అలవి కాని బాషాభిమానమే.


ప్రత్యుత్తరమిమ్ము