75 సంవత్సరాల సినిమా పండగ ఇలా ఉంటుంది అని నేను అనుకోలేదు. నేను మొత్తం చూడలేదో లేక పోతే అది అంతేనో కానీ, గొప్ప నటులకి పెద్ద పీట వెయ్యలేదు అని అనిపించింది.
చిరంజీవీ మోహన్ బాబు ల విష్యం ఐతే మరీ ఘోరం.. ఎక్కడో మన వాళ్ళ బ్లాగులో ఈ మధ్య చదివాను, “బాలకృష్ణ, చిరంజీవి కలిసి పోయారు – ఏంటి ఈ వింత” అని ఎవరో వ్రాసారు, అది కూడా నిజం కాదు అనిపించింది… ఈ విష్యం రూఢీ చెసుకోవడానికి నేను మరీ నిశితంగా ప్రతి వీడియోనీ పరిశీలించాను.. అంత సీను ఏమి లేదు లెండీ, ఏవో స్పర్ధలు కచ్చితంగా ఉన్నాయని మాత్రం అనిపించింది.
ఇంకా చిరంజీవి స్టాజీ మీద మాట్లాడుతుంటే పవన్ కల్యాణ్ జనాల్లో లేచి చిందులు తొక్కడం చూస్తే ఏదో ఆకతాయి పని లాగే ఉంది కానీ ఆ విష్యం ఎవరూ మెచ్చుకోరు. ఈ విష్యం ఇలా ఉండగా చిరంజీవి స్టేజీ దిగి ముందుగా అతన్నే కౌగిలించుకోవడం నన్ను ఆశ్చర్యపరిచింది.
నేను చిన్నప్పుడు, చిరంజీవి రాజకీయాలు చేస్తాడు అంటే నమ్మలేదు కానీ ఇప్పుడు అది కూడా నమ్మచ్చు అనే విధంగానే అంతా నడిచింది. చివ్వర్లో సునీల్ చదివిన వార్తలు మాత్రమే కాస్త నవ్వించగల్గాయి.. ఇంకా నిర్మలమ్మ చెప్పిన తన సినిమా కధ కూడా గుర్తుండిపోయే భావాలు రగిలించింది. మరెందరో నటులు త్రుప్తి చెందలేదనేది మాత్రం స్పష్టమైందిలే!
మహా నటులకు, దర్శకాది పెద్దలకు,ఇతర సినిమా సిబ్బందికీ, వందనాలు… సినిమా వర్ధిల్లాలి, ముందుగా బాగుపడాలి, ఇప్పట్లో తెలుగు సినిమాకి ఇది కష్టమే అనిపిస్తోంది, జనాలు ఏమి అంటారో?
అభిప్రాయములు
5:23 పూర్వాహ్నం వద్ద ఫిబ్రవరి 14, 2007
నేను కలసి పొయినారు అని చెప్పినది బాలయ్య అభిమానులు, చిరంజీవి అభిమానులు ఇన్ ఆర్కుట్ గురించి
అంటకు ముందు వారు కత్తులు కటార్లు తెగ నూరుతుండేవారు లేండి
2:43 అపరాహ్నం వద్ద ఫిబ్రవరి 14, 2007
ఓ..ఐతే వాకే!