సరే…మనం మొత్తానికి తెలుగు రాయటం(లేదా టైపు చెయ్యటం) ఐతే మొదలు పెట్టాము, కాబట్టి కొన్ని ఒడంబడికలు కూడా నిర్దేసించుకోవాలిగా, ముందుగా
క్రమ బద్ధీకరణ:
మీరు ఏ వికిపీడియాలోనో చదివితే మీకు అర్ధం ఔతుంది, అక్కడ కొన్ని వ్యాసాలు బాగానే ఆలోచించి వ్రాసారు, కాని మరి కొన్ని క్రమాన్ని పాటించలేదు, అది పాఠకులకు ఇబ్బంది కదా?
ఉదా ఊళ్ళ పేర్లు ఉన్న ఈ పేజీ క్రమ పద్ధతిని పాటించింది, కానీ ఇక్కడ అలాంటి ఒక జాబితా పద్దతిలో లేదు చూడండి.
నిదానంగా మర్పు
ఒకేసారిగా అచ్చ తెలుగు పద్దలను వాడేస్తే నేడు మీ బ్లాగు పత్రాన్ని చదవటమే కష్టం అవ్వగలదు.. అందుకని ముందు తేలిక పదాలను వాడుతూ, మీ బ్లాగులు జనాదరణ పొందుటం మొదలు పెట్టాక మెల్లగా తెలుగుని సంపూర్ణంగా వాడటం మంచిదని నా అభిప్రాయం.
గుర్తులు(punctuation marks)
తెలుగులో బ్లాగు రాశేటప్పుడు మధ్యలో వాడే (“,”,!,?,&,*@, వగైరా) ని తగ్గించగలరు, ఎందుకంటే యూనీకోడ్ తెలుగు మధ్యలో యాస్కీ ఆంగ్లాన్ని వాడటం వలన, ఆ అక్షరాలు పైకి లేచి నుంచుంటాయి, ఇది మరింత ఇబ్బందికరం.
తెలుగు లింకులు
చాలామంది సాగి ఉన్న లింకులను అసహ్యంగా భావించి వాటిని (post slugs) ఆంగ్లంలోకి మారుస్తున్నారు, కానీ అవి అలా సాగటంలోని ఉద్దేశం మీ “సంచారి (browser) “ని తెలుగు url ను చూపించ గలిగేట్టు చెయ్యాలనుకోవడమే!
బ్లాగు టెంప్లేట్
బ్లాగు అందానికంటే కూడా అక్షరాలు తేలికగా చదివేట్టు ఉందగలిగేలా చూస్కోగలరు. తెలుగు స్క్రిప్టు సరిగ్గా కనపడాలి.
గమనిక
టెంప్లేట్ మినహా తక్కిన ఒడంబడికలన్నీ అన్ని వ్రాత పద్దతులకూ పనికొస్తాయి, అవసరం అనిపించినచోట ఆలోచించి వాడగలరు. తక్కినవి ఇంకేమన్నా ఉంటే ఇదే పోస్టులో మారుస్తుంటాను. ధన్యవాదాలు….
1 వ్యాఖ్య
8:26 అపరాహ్నం వద్ద ఫిబ్రవరి 15, 2007
నాకు తెలిసి మీరు రాసిన దాంట్ల punctuation, post slugs గురించి ఉద్దేశించి రాసినట్టు గమనించిన. punctuation గురించి మీరు రాసింది చదివినంక తెలిసింది. కని post slugs విషయంల మాత్రం, తెలుగుల Display అయితె బాగనే ఉండు, ఇప్పటి కైతే అందరి browsers దీన్నీ సహకరించవు. అన్నీటికన్న English postslugs, bookmark చేస్కునుడు కూడ easy కదా? మీరు ఇంకా వేరే ఏదన్న ఉద్దేశించి అని ఉంటె అదేంటో చెప్పండి.