ఫిబ్రవరి 22, 2007...10:39 పూర్వాహ్నం

వెర్రి వెయ్యింతలు అవ్వటం అంటే ఏంటో అనుకున్నా

Jump to Comments

ఇందాకే యూట్యూబ్ లో పవన్ కల్యాణ్ వీడియో చూశా.. మామూలే కదా ఇలాంటి ప్రోగ్రాములు ఏవో ఎలాగూ జరుగుతాయి కదా వజ్రాత్సవాల తర్వాత అనుకున్నా, ఐతే అందులో వింత ఏమీ లేదు కానీ, కింద జనాల కామెంట్లు చూశాక దిమ్మ తిరిగింది నాకు….

అసలు, ఆ వీడియోలో మోహన్ బాబుని పవన్ కల్యాణ్ ఏమన్నడు, “తమ్ముడు” అని వ్యంగ్యంగా మాట్లాడటం తప్ప! ఇంతకీ అసలు మోహన్ బాబు మళ్ళా ఏమి అన్నాడు అని ఈ సంభాషణ అక్కడ వచ్చిందో! వజ్రోత్సవాలలో మాత్రం చిరంజీవిని మోహంబాబు ఏమి అంత గేలిచేశాడో కూడా తెలీలేదు, ఏదో మబ్బులో ఉన్నట్టు ఉంది నాకు, రాష్ట్రం లో లేను కదా?

అసలు జనాలు ఏంటి, మోహన్ బాబుని పిచ్చ పిచ్చగా తిడుతున్నారు, ఇక్కడ ఈయనగారు(చిరంజీవి) ఏమో బుద్ధిమంతుడి ఫోసులో కుర్చుని నవ్వడం ఒకటి మళ్ళా. చిరంజీవికి అవార్డు రావడం కరెక్టే అంటే మాత్రం ఒకొక్కడిని పట్టుకుని తన్నాలనిపిస్తుంది. మోహం బాబు చిరంజీవిని ఉద్దేసించి ఉంటే, అది కొంచెం ఆలోచించకుండా చేశిన పనే, నిజమే!

మరి చిరంజీవి మాటేంటి, ప్రతి సినిమాలో బొచ్చెడు సార్లు బ్లడ్ బ్యాంక్ పేరు చెప్పి దానికి పబ్లిసిటి, బ్లడ్ బ్యాంకు పేరు చెప్పి ఈయన సొంత పబ్లిసిటి, జనాలకి ఇవేమీ తెలీకుండా జేజేలు కొట్టెయ్యడం… సినిమాలు ఫ్లాప్ అవ్వడం, వెంటనే అవార్డు వచ్చెయ్యడం!

నేనూ ఒకప్పుడు భయంకరమైన చిరంజీవి అభిమానినేనండొయ్, కానీ నిజాలు మాట్లాడాలి కదా కనీసం అప్పుడప్పుదు అన్నా(తప్పుదోవ అన్నా వెళ్ళకుండా ఉంటే చాలు మన వరకు) నాయకులే మారుతున్నప్పుడు నేనెంత…యధా రాజ తదా ప్రజ!

కొందరి మాట (ప్రస్తుతానికి)

గమనిక: పైన రాశిన పోస్టును ఇష్టం లేని వారు చదవ వలసిన పని లేదు.
Disclaimer: Reader discretion is strictly encouraged.

1 వ్యాఖ్య


ప్రత్యుత్తరమిమ్ము