ఫిబ్రవరి 26, 2007...9:57 పూర్వాహ్నం

నా ఎదవ గోల…

Jump to Comments

ఇదేంటి అనుకుంటున్నారా, ఏమీ లేదండీ బాబు, అసలు బ్లాగర్ల ప్రపంచానికి నన్ను నేను పరిచయం చేస్కోకుండానే బ్లాగేస్తున్నను అనిపించి ఎస్.డి చెప్పుకుంటున్నా అంతే.

నిజానికి నేన్ను కొత్తగా పరిచయం చేస్కోకపోవటానికి కొన్ని కారణాలు ఉన్నాయి లెండి.

ఒకటి. నేను ఇంతకు ముందు దాకా ఒక నాలుగు కొత్త బ్లాగులు కెలికి వదిలేశా..ఇది కూడా అలా చేస్తానేమో అనీ… (ఇప్పుడు లేదు లెండి)

రెండు. ఈ బ్లాగుని నా సొంత బ్లాగులాగా కాకుండా… కొంచెం జనరల్ గా రాద్దామనుకున్నా… అది కూడా ఒక కారణం.. (కానీ జనాలు అయ్యోమయ్యంలో పడతారేమో అని ఇప్పుడు తప్పలేదు)

ఇంతకీ…వివరాలు
పేరు: మధు
ఉన్న చోటు: అప్రస్తుతం
బ్లాగు పేరు: దీనికి “జిల్లా గ్రంధాలయం” అని పెట్టడానికి కారణం, అందర్కి పనికి వస్తుంది అని….(కొంచెం వెరైటీగా కూడా ఉంటుంది కదా).. అందుకే ‘నా గోల’కి వేరే tag పెట్టానులెండి.

మిగితావి మళ్ళీ మాట్లాడుకుందాం, ఉంటా మరి…

ప్రత్యుత్తరమిమ్ము