బహుశా మీ అందరికీ తెలిసే ఉంటుంది…మైక్రోసాఫ్ట్, మొన్ననే వాళ్ళ సరి కొత్త ఆపరేటింగ్ సిస్టం విడుదల చేశారు అని…ఐతే!
అందరు అంటున్నది నిజమే.. విస్టాలో, ఎక్స్ పి కంటే పెద్ద పెను మార్పులు ఏమీ కనపడలేదు, కేవలం కొంత ఆకర్షణీయంగా మాత్రం ఉంది, వీళ్ళు OS X ని కాపీ కొట్టారు అనే విష్యంలో వాస్తవం లేక పోలేదు. ( OS X అనేది APPLE మ్యాక్ కంపెనీ వారి OS “ఓ యెస్” ). తదణుగుణంగానే ఇది మన కంప్యూటర్ని పూర్తిగా వాడేస్తుంది, ఆ గ్రాఫిక్సుని రన్ చెయ్యడానికి!
ఐతే, ఎప్పటిలాగే ధీటైన సాఫ్ట్వేర్ తయారు చేశే మ్యాక్ వారు, వారి తదుపరి ఆపరేటింగ్ సిస్టం(OS X Leapord) ని వేసవిలో విడుదల చెయ్యనున్నారు. వీరి గొప్పతనం వారి సాఫ్ట్వేర్ కంటే కూడా వారి కంప్యూటర్ హార్డ్వేర్ అని చెప్పుకోవాలి. ఒక సారి ప్రయత్నిస్తే మీకే తెలుస్తుంది లెండి!
ఇంతకీ, విస్టా సంగతులు చెప్పుకోవాలంటే, అన్నింటికంటే ముఖ్యంగా మన తెలుగుకి ఇందులో సరిపడా సౌకర్యం ఉంది, వేరేగా భాషా పరికరాలు, ప్యాక్లు వెయ్యల్సిన పని లేదు, కేవలం మన కీబోర్డుని కాంఫిగర్ చేస్తే సరిపోతుంది, ఐతే మీరు మీ మీ కంప్యూటర్ హర్డ్వేర్లు విస్టాను సమర్ధించగలవో లేదో ముందుగానే చూస్కోవటం మంచిది. నిజమే, మన దేశంలో కొనటానికి ఖరీదే కానీ మీకు ఎలా రప్పించుకోవాలో తెలుసునని నాకు తెల్సుయంది కాదు!
ఇందులో కొన్ని అప్లికేషనులు, మేడియా ప్లేయర్, కాంటాక్ట్స్ వంటివి పరిపుష్టంగా ఆకర్షణీయంగా ఉన్నయని చెప్పాలి. ఏది ఏమైనా ఇది పాత విండోస్ కి అప్ గ్రేడే కనుక, ఆ ఆకర్షణ అంతా పైన పెటారం లోన లొటారం అని మెల్లగా తెలుస్తుంది…. కొన్నళ్ళు వాడాక ఈ విష్యాన్ని మీరూ గమనిస్తారు.
పెద్దగా అర్జించలేక పోయినా ఈ ఆపరేటింగ్ సిస్టం కనీసం మన తెలుగువారికి కొంచెం ఉపకారి అంతే(తెలుగు అంటే ఒట్టి తెలుగే కాదు దేశ భాషలకి బానే సపోర్ట్ ఉంది)…నష్టాలు, కష్టాలు పడుతున్న మైక్రోసాఫ్ట్ కి ఇకపై తంటాలు తప్పవేమో, మరి అయిదేళ్ళ పని బూడిదలో పోసిన పన్నీరైంది కదా..
కొత్తగా కంప్యూటర్(మొత్తం ప్రొప్రైటరీ) కొనే వాళ్ళు రాబోయే మ్యాక్ కోసం ఆగటం మంచిది అని నా ఉద్దేశం, మ్యాక్ నిజానికి చాల తెలికగా, అందంగా ఉంటుంది… మీకు నచ్చుతుంది కూడా.
విస్టా గురుంచి మీ వ్యాఖ్యలు, సందేహాలు(తెలుగుకి సంబంధించి..) తెలియచేయగలరు. తెలుగు బ్లాగర్ల సంఘం వారి (AUTO ENABLE SOFTWARE) ఏమైనట్టో? ఆ ఫైళ్ళు నాకు సరిగ్గా తెలీగు కానీ, ఆ సహాయం కూడా నేను చేద్దామనుకుంటున్నాను… XP, 98 లు వాడేవాళ్ళకి కావాలి కదా మరి!
అభిప్రాయములు
2:24 అపరాహ్నం వద్ద ఫిబ్రవరి 28, 2007
You have provided most of the information with out even looking at windows vista properly. I myself have been using machintosh since 5 years and I love mac for different reasons. But I cannot even put mac and vista side by side and compare. Mac is basically not a power system. It shows all the beatiful world, but lacks the definitive power of doing many things in life. I see atleast 1 crash everyday in my day to day job with Machintosh (mac iBook with OSX).
I am also using Windows Vista since it’s beta stages, and I must admit that it has got the heart from Windows XP but not at all a copy of Windows XP. Infact Mac is a steadily copying its own OS since 5 years. There are no revolutionary changes at all. They have improved the look and feel again.
Coming back to Windows Vista, as a developer I can clearly understand what went in to the heart of the OS. The kernel and security model was totally revamped and XP cannot match with Vista’s security in Windows OS space. In User experience space, search was built in to OS level and has been opened for developers as API and that is the feature I like very much. SuperFetch, Ready Drive or ReadyBoost technologies are far superior than mac and only linux can be compared with Vista. In enterprise OS market, you have only 2% of business critical applications are supporting mac partially. The remaining market is demanding more in Linux and Windows space.
Comparing Mac and Windows would only gives some satisfaction to Steve Jobs but it will takes years for Mac to come to a state where business end users adopt OS like Vista or Linux.
I recommend Mac for the following people….graphics developers who develop pictures and edit movies…hobbiests who doesnt do any thing other than blogging or sending mails (still outlook for mac is the best email client on mac)..you can take mac if you are ok with the few choice of software available in market for you. Apple does’nt gives you a single thing for free (even Beta software).
I am a proud Mac owner and I am a proud Vista owner too…The only difference between two “proud”s is the context I use them…
6:56 అపరాహ్నం వద్ద ఫిబ్రవరి 28, 2007
విండోసు XP ని రిలీజు చేసినప్పుడు కూడా ఇలాంటి వ్యాఖ్యలే వచ్చాయి. విస్తాలో కొత్తగా ఏముందో తెలుసుకొనడానికి http://en.wikipedia.org/wiki/Windows_vista#New_or_altered_features చూడండి.
2:11 పూర్వాహ్నం వద్ద మార్చి 1, 2007
నిజమే మీరు అన్నది…ఐతే నేను అంటున్నది, ఇది అయిదేళ్ళ కృషికి సరిపడా ఫలితం కాదని! అంతే కాని విస్టా ఎందుకూ పనికి రాదు అని కాదు…పైగా ఈ పోస్టులో నేను విస్టా గురించి ఈ విషయాలు చెప్పటమే కాకుండా తెలుగుకి కొంచెం సపోర్ట్ కూడా ఉందని చెప్తున్నా..
ఇంకో విషయం ఏమిటంటే, నేను విస్టా లో మ్యాక్ లో ఉన్న విషయాలు ఉన్నాయి అన్నను కానీ…విండోస్ అంతా మ్యాక్ కి కాపీ అన లేదు..అలా ఎందుకన్నానో ఈ లంకె చూడగలరు. ఇది కేవలం కామెడీ వీడియో ఐతే న్యూయార్క్ టైంస్ ప్రచురంచదని వేరే చెప్పక్కర్లేదనుకుంట!
ఇంకో విషయం ఏంటో చెప్పనా మ్యాక్ వాళ్ళ ఆపరేటింగ్ సిస్టం, పాత హార్డ్వేర్ మీద కూడ మరింత వేగంగా నడిచేది, వాళ్ళు ఎప్పుడూ సిస్టం రెక్వైర్మెంట్లని ఇంత ఘోరంగా పెంచలేదు…
ఏది ఏమైనా మీఅరు ఇంత ఆవేదన చెందారు కాబట్టి ఈ విషయం మీద నేను తెలుసుకుంటున్నది అంతా అప్డేట్ చెయ్యడానికి ప్రయత్నిస్తా.
2:14 పూర్వాహ్నం వద్ద మార్చి 1, 2007
లంకె ఇక్కడ http://www.youtube.com/watch?v=QT6YO30GhmQ
3:53 పూర్వాహ్నం వద్ద మార్చి 1, 2007
విష్టా సిస్టం రిక్వైర్మెంట్ల మీద కాస్త జనాలలో అపోహలు వున్నాయి. అదేమిటంటే దీనికి కనీసం 1GB మెమరీ కావాలని. కానీ ఇది ఒక అపోహ. నా కంప్యూటర్లో 512 MB తోనే నాకు Aero Glass Effect కూడా పని చేస్తుంది. Aero Glass Effect వచ్చింది అంటే Performance చాలా బాగుంటుంది. ఎందుకంటే విస్తా మీ గ్రాఫిక్స్ కార్డుని వాడుతుంది vector rendering కోసం. అది సాఫ్టువేర్ ద్వారా చేస్తే చాలా మెమరీ అవసరం అవుతుంది. నాకు laptop లో XP, Desktop లో విస్టా వున్నాయి. నాకైతే విస్తానే faster అనిపించింది.
అయితే ఒకటి మాత్రం నిజం, విండోస్ 95, 98 పని చేసిన కాన్ఫిగరేషన్ లో మాత్రం ఇది చస్తే పని చెయ్యదు. చెయ్యాల్సిన పని కూడా లేదు (మూర్స్ లా ప్రకారం కంప్యూటింగ్ పవర్ పెరుగుతూ పోతే).
ఇక మ్యాక్ సంగతి నాకు తెలియదు కానీ, దానిని ఇప్పటి వరకూ సీరియస్ పనులకు వాడిన వాళ్ళను ఒక్కడినీ నేను చూడలేదు. మొన్న సన్ టెక్ డేస్ 2007 లో కూడా XP, Linux, Solaris వాడారే కానీ, ఒక్కడి దగ్గర కూడా మ్యాక్ లేదు.
నాకు తెలిసీ మ్యాక్ పాత హార్డ్ వేర్ Intel x86 కన్న చాలా నెమ్మది. ఎందుకంటే MBP (mac book pro on x86) వచ్చాక దాని వేగం 60% పెరిగిందట. అందుకని అందరూ MBP ల వైపు మొగ్గుతున్నారు. MBP అయితే XP, Mac రెండింటినీ ఒకే సిస్టం పై నడపొచ్చు.
ఇక న్యూయార్క్ టైమ్స్…ప్రపంచంలొ ఎక్కడయినా సరే…పత్రికల వారికి తెలిసిన సాంకేతిక విషయాలు మిడిమిడి మాత్రమే. ఎవరు చెప్పినా వినరు. కొన్ని సార్లు ఈనాడులో కూడా వస్తున్న వార్తలు అలానే వున్నాయి. ఉదా. విస్తాని ఎవరైనా MP3 పాటతో format చెయ్యవచ్చని. నిజానికి అలా చెయ్యగలిగితే దానికి Vista ఒక్కటే కాదు , speech recognition ఉన్న ఏ OS అయినా ఆ లోపాన్ని కలిగి వుంటుంది.
7:48 పూర్వాహ్నం వద్ద మార్చి 1, 2007
ముందు ముందు రాబోయే జాబులు కూడా చదువుతారని ఆశిస్తున్నా, ఈ విషయం పై మనకి జవాబు అందులో దొరుకుతుందేమో!