మార్చి 1, 2007...9:15 పూర్వాహ్నం

దారి తప్పిన పరాయి బ్లాగు:

Jump to Comments

ఈపాటికి అందరూ గమనించే ఉండుంటారు, ఎవరో తమ బ్లాగుని ఒక్క తెలుగు అక్షరం కూడా లేకుండా తెలుగు బ్లాగుగా నమోదు చేశారు. విడ్డూరం ఏంటయ్య అంటే, అయ్యగారి బ్లాగుని ఇప్పటికే 3049 సార్లు జనం చదివారంట. బహుశా వెరే వెరే భాషల్లో బ్లాగుని విభాగించుకుంటూ పోతే, అన్ని భాషల వాళ్ళూ ఇదేమిటబ్బా అని చూసేసి ఉంటారు.

లేదా బ్లాగు సందర్శకులను పెంచుకోవటానుకి తుత్తర తెలివితేటలు కాబోలు..ఒకవేళ దారి తప్పు కూడా ఉండచ్చు, ఏమో ఎవరికి తెలుసు ఇందులో తిరకాసు ఏంటో!

ఇంతకీ మనం కూడా చూసి ఊరుకుందామా, అయ్యగారికి ఒకమాట చెప్పుదామా? ఏమంటారు?

ప్రత్యుత్తరమిమ్ము