ఏప్రియల్ 3, 2007...9:28 అపరాహ్నం

అర్ధం పర్దం లేని నా పాకులాట

Jump to Comments

మన నాలుగు రాష్ట్రాలను విద్యాసంపన్నమైన ప్రాంతాలుగా చెప్తుంటారు.. ప్రత్యేకంగా మన ఆంధ్ర దేశాన్ని అటు, ఉత్తర భారతదేశానికి, ఇటు దక్షిణాది రాష్ట్రాలకు లంకెగా వర్ణిస్తారు. ఎన్నో స్వదేశీ విదేశీ సంస్థల్లో మనవాళ్ళు అత్యంత కీలకపాత్రలు పోషిస్తున్నారు, నిజమే కానీ,

మనవాళ్ళు తాము సంపాదించిన ఇటువంటి ఘనతలో కనీసం కొంత భాగాన్ని కూడా తిరిగి మన రాష్ట్రానికీ, రాష్ట్ర ప్రజలకు ఎందుకు అందించలేకపొతున్నారు అనేది నన్ను ఎప్పుడూ తొలిచివేసే విషయం. నేను ఎందుకు ఇలా అంటున్నాను అంటే, మీరే చూడండి…

ఒక పక్క విదేశాలలో, ప్రతి మూడొంతులలో, రెండొంతులు మన తెలుగు వారే ఉంటారు… ఆ తెల్లతోలు వాళ్ళకి అంతంత చాకిరీ చేస్తారు, వేరే రాష్ట్రాల వాళ్ళకీ ఇంతలేశి పని చేశి పెడుతుంటారు. తమ మేధస్సుని తక్కిన వాళ్ళకి ఉపయోగించినదాంట్లో ఎంతోకొంత తమవారికి కూడా ఇవ్వచ్చు కదా!

అర్ధం పర్దం లేకుండా, రిజర్వేషన్ల కోసం పోరాటాలు చెయ్యడం, మరికొంత మంది రాష్ట్రాన్ని స్వలాభం కోసం ముక్కలుగా చేశే ప్రయత్నం చెయ్యడం…ఇవన్నీ అవసరమా??

1 వ్యాఖ్య

  • భాయ్ సాబ్ !
    “ఒక పక్క విదేశాలలో, ప్రతి మూడొంతులలో, రెండొంతులు మన తెలుగు వారే ఉంటారు…” ఈ విషయంల అమెరికాను తీసుకుంటె, మన తెలుగు వాల్లు జనాభాల 0.02% మాత్రమే… తెలుగు వాల్లు ఉంటే అందరూ ఒక్క చోటనే ఉంటరు అంత మాత్రాన ” ప్రతి మూడొంతులలో, రెండొంతులు” మన తెలుగు వారు ఉండరు …

    “మనవాళ్ళు తాము సంపాదించిన ఇటువంటి ఘనతలో కనీసం కొంత భాగాన్ని కూడా తిరిగి మన రాష్ట్రానికీ, రాష్ట్ర ప్రజలకు ఎందుకు అందించలేకపొతున్నారు అనేది నన్ను ఎప్పుడూ తొలిచివేసే విషయం” ఇంత వరకు బాగానే ఉన్నది…
    కని ఆంధ్ర ప్రదేశ్ (లేదా మొత్తం భారత దేశంల) ఉన్న(అన్ని లేదా కొన్ని) సమస్యలకు సంపన్న NRIలే ఒక పరిష్కారం అన్నట్టు మీరిచ్చిన statement సరిగ్గా అనిపిస్తలేదు.

    (సంపన్న) NRIలకు వాల్ల ఆర్థిక బలంవల్ల potential ఉండొచ్చు, ఒకవేల వాల్లు ఏమైనా చేద్దామనుకుంటె తిరిగి దేశానికి వచ్చి పెట్టుబడులు పెట్టి వనరులను కొల్లగొట్టడం తప్ప ఇంకోటి ఉంటుందా? నిస్వార్థంగా ఎవరైనా ఏమైనా చెయ్యాలని తలపెట్టినా వాల్లకు మిగితావాల్ల మాదిరిగ ప్రెస్ కవరేజీ ఉంటుందా ?


ప్రత్యుత్తరమిమ్ము