మొత్తం గూగుల్ అనువాదలని కెలికేశారు. గూగుల్ తెలుగులో, ఆంగ్ల అక్షరాలు ఎందుకు వస్తున్నాయా అనుకుంటున్నా, ఇన్నాళ్ళూ!
అనువదించమంటే, అలా ఎవరు చేసిపెట్టారో కానీ, ఇప్పుడు, పని రెండింతలు అయ్యేట్టు ఉంది. ఒక పకడ్బందీ ఉపాయం వేస్తే తప్ప అవ్వదు ఏమో?
కొన్నాళ్ళు చూస్తాను,వల్లకాదు అనిపిస్తే ఇంక వదిలేస్తానండీ బాబు. మెల్లగా నాకు కూడా గూగుల్ మీద మోజు పోతోంది.
మేరే చూడండి, గూగుల్ తెలుగు ఎంత అధ్వానంగా ఆంగ్ల అక్షరాలకి దాసోహం అయిపోయిందో.
అభిప్రాయములు
2:12 పూర్వాహ్నం వద్ద ఏప్రియల్ 4, 2007
అలా కెలికిపెట్టడం ఒక ఎత్తు, వాటిని సరిదిద్ది, తెలుగులో రాస్తే వాటిని గూగుల్ మార్చడం లేదండి. గూగుల్ కు రాసాను, వాళ్ళ దగ్గరి నుండి సమాధానం లేదు.
9:47 అపరాహ్నం వద్ద ఏప్రియల్ 4, 2007
అందుకే, గూగుల్ని తర్జుమా చేసే పని వదులుకుని, ఎవరన్నా ఒక మంచి తెలుగోపకరణం మొదలుపెడితే, వారితో కలుద్దామని అనుకుంటున్నా.. చూడాలి!