ముందుమాట

నా బ్లాగు మీద కనపడుతున్న సమాచారాం అంతా మళ్ళా ఎక్కడైనా ఉపయోగించుకోవచ్చు. ఐతే సమాచారన్ని మీకు అనుగుణంగా మార్చుకున్నప్పుడు దయచేసి దీన్ని చూపించద్దు. బ్లాగు పై ఉన్న సమాచారంలో ఏదన్నా పాతాది కానీ పూర్తిగా లేనిది కానీ ఉంటే దయచేసి తెలియచేయగలరు.

ఈ బ్లాగులో ఏ సైటుకైనా, సంస్థకైన ప్రచారం ఉన్నట్టు అనిపిస్తే, అది కేవలం సమాచారాన్ని చేరవేయడం, విషయాన్ని జనాలకి తెలియచేసి, తద్వారా వెలుగులోకి తీసుకుని వద్దామనే తప్ప ఏ సొంత లాభమూ లేదని గమనించగలరు. సొంత సోదీ, రాగ ద్వేషాలు ఉండే అవకాశమున్న విషయాలను ముందుగానే “నా గోల” అనే విభాగం కింద జతపరచడమైనది, గమనించగలరు!

ఏ వాణిజ్య, స్వచ్చంధ సంస్థకు కానీ, వారి హక్కులకు ఈ సైటు మూలంగా ఉల్లంఘన జరుగుతున్నట్టు అనిపిస్తే ముందుగా తెలియ చేయగలరు.

ఎవరైనా తమ వ్యాఖ్యలను స్వేఛ్ఛగా తెలియచేయవచ్చును, ఐతే అందరినీ దృష్టిలో ఉంచుకుని వ్యాఖ్యానిస్తారని ఆశిస్తున్నా..

ఇట్లు
జిల్లా గ్రంధాలయం