మొన్న విస్టా గురించి వాగినప్పుడు, అది ఎక్స్ పి కంటే కొంత ఎక్కువగా తెలుగుకి మేలు చేస్తుందనే విషయం అందరికీ అర్ధం అయ్యే ఉంటుంది, ఐతే మిగితా విషయాలు గిరుంచి మనలో కొంతమంది విండోస్ డెవలపర్లు పెదవి విరిచుకున్నట్టు ఉన్నారు. ఏది ఏమైనా వాగడం మొదలెట్టాను కనక, కొనసాగించడం తప్పని సరి అని అర్ధం అయ్యింది. ఐతే..
పేరు చెప్పని ఆసామి అన్నట్టు మ్యాక్ రోజుకి ఒకసారి క్రేష్ ఔతుంది అనే మాట అన్ని సార్లు వాస్తవం కాదండి! ఎందుకంటే, మా స్నేహితుడొకడు తన మ్యాక్ బుక్ ను రెండు సంవత్సరాలలో ఒక్క సారి కూడా కట్టెయ్యలేదు(షట్ డౌన్), ఆ అవసరం రాలేదు అంటే నేను కూడా నోరు తెరిచి చూశాను, ఆ తరవాత ఇంకా 4, 5 మందిని స్వతహాగా కలిశాక, ఆ విషయం నమ్మకతప్పలేదు. నాలుగు నెలలు కిద కొన్న నా మ్యాక్ బుక్ ని కూడా ఇప్పట్ వరకు కట్టెయ్యలేదు అంతే నమ్ముతారా.
అన్నట్టు తమ ఓ ఎస్ ను తమ కంపెనీ వారు కాపీ కొట్టుకుంటే తప్పేముందో అర్ధం కాలేదు. అంతా బాగున్నప్పుడు పోయేదేముందంట?
ఇక గ్రేఫిక్కుల విషయానికి వస్తే, నిజమే కోర్ యానిమేషనుని విండోస్ లో మిళితం చేసినందు వల్ల అన్నీ అందం గా ఉంటాయి, ఐతే లోపలి విడో ఏ పీ ఐ అంత మార్పులు నాకు ఏమీ కనపడలేదండీ, బహుశా ఇంకొన్నాళ్ళకి ఏమన్నా కనపడుతుందేమో?! 512 ఎం బి అంతే మరి అందరికీ ఉండదు కదా. మరి 512 ఎం బి నే ఎప్పుడూ అమ్మే మ్యాక్ లో అన్ని వర్షనులూ పనిచేస్తున్నయ్ కదా? ఏది నయం అంటారు?
ఇక ఉచిత సాఫ్ట్వేర్ అంటారా, ఏ కంపెనీ ఉచిత సాఫ్ట్వేర్ ఇచ్చినా దాని వెనక అంతరార్ధం వేరే ఉంటుంది, పిక్చర్ మేనేజర్ అనే మైక్రోసాఫ్ట్ ఉప్పకరణ ఆఫీస్ తోనే కొనచ్చు, మరి ఆఫీస్ అంటే 700 డాలర్లు, అదే మ్యక్ ఫొటోబుక్ ఓ ఎస్ తో ఉచితం, రెంటినీ పక్కన పెట్టి పోల్చితే మీరే మొదటి దాని మీద ఊస్తారు!
అలా అని నేను మ్యాక్ పక్ష పాతిని కూడా కాదు… వాళ్ళు చేసేది వ్యాపారమే, జనాలని ఏమీ ఉద్ధరిచట్లేదు. పైగా వారి ఓ ఎస్ ను వాడాలి అంటే కంప్యూటర్ను కూడా వారి దగ్గరే కొనాలి. ఇది చాలా మందికి బాధాకరమే, ముఖ్యంగా మన జతచేసిన(ఎసెంబుల్డ్) కంప్యూటర్లు వాడే వాళ్ళకి ఎందుకూ పనికి రాదు…వాళ్ళ మార్కెట్టు వాళ్ళది మరి!
మరి కంప్యూతర్లు జనాల్లోకి వేగంగా దూసుకుపోతున్న ఈ రోజుల్లో జనాలు మెచ్చే సాఫ్ట్వేర్ కొనుక్కుంటారు కానీ అటు డెవెలప్పర్ కీ(లినక్స్ మంచిది కదా), ఇటు చివరాఖరి వినియోగదారుడికీ(మ్యాక్) పనికి రానిది శ్రేష్టం అని ఎట్లా అంటాం? అందుకే మెల్లగా అందరూ మ్యాక్ ల వైపూ జనాలు మొగ్గుతున్నారు. చూద్దాం వాడగా వాడగా విండోస్ జనాన్ని ఎంత మెప్పిస్తుందో?
ఇదంతా ఎలాగున్నా ఈ రజుకి మాత్రం విండోస్ ను వాడటంలో తప్పు లేదు, ఎందుకంటే, నాలా, చాలా మందికి కంప్యూటర్ గేంస్ అనీ, తక్కిన ఉచిత సాఫ్ట్వేర్ అనీ, ప్రస్తుతానికి, విండోస్ కి ఉన్నంత గుర్తింపు మిగితా వాటికి లేవు, పైగా లినక్స్ కి కదులుదామంటే సరిపడా సమయం కానీ, సలహా కానీ ఇప్పుడిప్పుడే దొరుకుతోంది…అందుకే నేను కూడా అటు ప్రయాణిస్తున్నా..ఏదో ఒక రోజు మీరు కూడా నాతో లినక్స్ రధాన్ని ముందుకు తీసుకుని వెళ్తారు కదూ?
ఆ రధాన్ని వదిలేసినా పరవాలేదు కానీ మన తెలుగు రధం తాళ్ళు గట్టిగా పట్టుకునే ఉండండి.
తెలుగు భాష మాట్లాడదాం, తెలుగు అక్షరాలు రాద్దాం, తెలుగు వంటలు తిందాం, తెలుగు బతుకు బతుకుదాం.
జై తెలుగు తల్లి…(ఆవేశం ఎక్కువైందా??)